తేతల సత్యన్నారాయణరెడ్డి అను నేను తూ..గో.. జిల్లా అనపర్తి గ్రామ వాస్తవ్యుడను. నేను ప్రస్తుతం కాకినాడ రూరల్ వాకలపూడి లో నివసించుచున్నాను.
హైందవ కుటుంబస్థుడనైన నేను విగ్రహారాధనలు, అభిషేకాలు, పూజలు, వ్రతాలు మొదలగునవి ఎన్నో ఆచరించెడివాడను. వ్యాపార సమస్యలు నిమిత్తము మరింత ఎక్కువగా తీర్థయాత్రలు చేసెడి వాడను.
మా నాయనమ్మ, మా తండ్రి గారికి ఏసును గురించివారికి కొంత తెలుసు. మా చిన్నప్పుడు ఆపద కల్గినపుడు ఏసునే స్మరించే వారు. ఆ జ్ఞాపకాలతో, నేను ఆర్ధిక సంక్షోభంనుంచి బయట పడితే చిన్న పార్ధన కూటము ఏర్పాటు చేసుకుంటానని అనుకున్నాను. నా కుమారుడి వివాహా విషయములో నా ఆరోగ్య విషయములో దేవుడు తోడుగా ఉండునట్లు వేడుకొనియున్నాను. నేను అనుకొనిన విధముగా కూటము జరిపించిన తరువాత వీటన్నిటినుండి నేను విడుదల పొంది మరింత దేవునికి దగ్గరయ్యాను.
అప్పటి నుండి విగ్రహారాధనకు స్వస్తి పలికి షాలోమ్ వర్షిప్ సెంటరు, పాస్టరు ప్రసాదు గారి వాక్యం ద్వారా మారుమనసు కలిగి పాపక్షమాపణ, రక్షణ , బాప్తీసము పొంది దేవుని కుమారుడుగా మార్చబడ్డాను.
నా జీవితంలో అనేక మేలులతో ముందుకు నడిపించుచున్న దేవునికే మహిమ కల్గును గాక!